మన ప్రగతి న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి :
జోగులాంబ గద్వాల జిల్లా జిల్లాలోని పలు గ్రామాలను సందర్శించడం జరిగింది రాజోలి మండలం మన్ దొడ్డి,పచ్చర్ల,గ్రామాలలో హెపటైటిస్ సి మరియు పెరాలసిస్ డయాలసిస్ కేసులు ఎక్కువ ఉన్నాయని సమాచారం రావడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె సంధ్యాకిరణ్మయి ఆధ్వర్యంలో రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ మరియు బృందం గ్రామాలను పర్యటించడం జరిగింది అనంతరం ప్రజలతో సమావేశమై చర్చించడం జరిగింది సందర్భంగా డాక్టర్ అమర్ సింగ్ మాట్లాడుతూ హెపటైటిస్ సి నీటి వలన రాదని ఏ విధంగా వస్తాయంటే శారీరక శ్రమ లేకపోవడం అధిక కొలెస్ట్రాల్ ఉండడం బీపీ షుగర్ నియంత్రణలో లేకపోవడం వస్తాయని ముఖ్యంగా ప్రజలలో ఇట్టి వ్యాధుల గురించి అవగాహన కల్పించాలని మరియు రాజోలి మండలం గ్రామాల యందు క్యాంపులు నిర్వహించి అందరికీ బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను సేకరించి టి హాబ్ కు పంపించాలని మరియు అవసరమైన వారికి మందులు పంపిణీ చేయాలని అందరికీ అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా తెలిపారు అనంతరం రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి డాక్టర్ మధుబాబు అన్ని గ్రామాలలో పరీక్షలు నిర్వహించి ఫాలోఅప్ చేయాలని తెలిపారు
సమావేశానికి మాన్ దొడ్డి సబ్ సెంటర్ వైద్య సిబ్బంది గ్రామ సర్పంచ్ సుజాత, ఉప సర్పంచ్ భీమన్న గ్రామస్తులు జిల్లా కో ఆర్డినేటర్ శ్యామ్ సుందర్ ఎం పి హెచ్ ఈ ఓ రామకృష్ణ హెల్త్ అసిస్టెంట్ రంజిత్ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

