Breaking News

వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పిట్టల మనోహర్

మన ప్రగతి న్యూస్ /వేములవాడ:

వేములవాడ బార్ అసోసియేషన్ ఎన్నికలు ఉత్సాహంగా జరిగాయి.శనివారం నిర్వహించిన ఈ ఎన్నికల్లో మొత్తం 116 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవికి పిట్టల మనోహర్ విజయం సాధించి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షుడిగా శంకర్ ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శిగా భాను కృష్ణ బాధ్యతలు స్వీకరించనున్నారు. జాయింట్ సెక్రటరీగా శ్రీనివాస్, స్పోర్ట్స్ సెక్రటరీగా కర్ణతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు కూడా ఎన్నికయ్యారు.ఈ ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి న్యాయవాదులు అభినందనలు తెలియజేశారు.

గంజాయి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డ నేరస్తులు.