మన ప్రగతి న్యూస్ / వర్ధన్నపేట :
వర్ధన్నపేట మండల పరిధిలోని కట్ర్యాల గ్రామానికి చెందిన మేక లింగాలు రాజమ్మ దంపతులకు నలుగురు కూతుర్లలో చిన్న కూతురైన కళ్యాణిని గణపురం గ్రామానికి చెందిన టి ఎస్ ఎస్ పి మామునూరు బెటాలియన్ చెందిన హరీష్ అనే కానిస్టేబుల్ తో వివాహం జరిపించారు. వీరికి రెండు సంవత్సరాల కుమారుడు శ్రేయస్సు కలడు. శనివారం రోజున భర్త వేధింపులు తట్టుకోలేక తల్లిగారి గ్రామమైన కట్ర్యాల గ్రామానికి చేరుకొని వారి వ్యవసాయ భూమి సమీపంలో ఉన్న ఎస్ ఆర్ ఎస్ సి కెనాల్ లో రెండు సంవత్సరాల కుమారుడుతో సహా దూకి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

