Breaking News

నేటి తరానికి ఆదర్శం అంబేద్కర్.

మన ప్రగతి న్యూస్ / గుండాల ప్రతినిధి :
భారత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ నేటితరానికి ఆదర్శమని ఆయన చేసిన కృషి వళ్ళనే మనం అనేక రంగాల్లో రాణిస్తున్నామని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. 135 జయంతి ఉత్సవాళ్ళో భాగంగా మండలంలోని మరిపడిగా గ్రామంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ విద్యావంతులుగా ప్రజాప్రతినిధులు గా అనేక రంగాల్లోరాణిస్తున్నామంటే ఆయనరాసిన రాజ్యాంగం వళ్ళనే అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గూడెం కుమార్, అంబేద్కర్ విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్షులు పానుగంటి విజయ్, గౌరవ అధ్యక్షులు తాండ్ర శోభన్ బాబు యూత్ అధ్యక్షులు పానుగంటి సురేష్, ఉప సర్పంచ్ చొప్పరి సోమయ్య, గౌరవ సలహాదారులు కుమారస్వామి, మాజీ ఎంపిటిసి సింగారం సునీత -ఉప్పలయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

పడవ పల్టీ కొట్టి యువకుడు గల్లంతు..