Breaking News

యువకుడు అదృశ్యం..

మన ప్రగతి న్యూస్ / జవర్ నగర్, మేడ్చల్ జిల్లా స్టాపర్ :

కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఓ యువకుడు అదృశ్యమైన ఘటన జవర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మిగడ్డ, భరత్ నగర్ ప్రాంతానికి చెందిన రేవు రామ స్వామి(26)కి శివాని తో మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. ఈ నెల 18 న మధ్యాహ్నం దంపతుల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన రామస్వామి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి వరకు తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులపై కిడ్నాపర్ వీరంగం!