Breaking News

కారు పల్టీ కొట్టి.. ఒకరు మృతి..

  • ఐదుగురికి తీవ్ర గాయాలు..

మన ప్రగతి న్యూస్/నడికూడ:

కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి.. ఒకరు మృతి చెందిన సంఘటన నడి కూ డ మండలం నర్సక్కపల్లి సమీపంలోని కల్వర్టు వద్ద బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఆరుగురు వ్యక్తులు ప్రయాణి స్తుండగా.. ఒకరు స్పాట్ లోనే మృతి చెందగా.. మిగతా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని తెలిసింది. కార్ నెంబర్ ఏపీ 28 డిబి 7745 గా గుర్తిం చారు. ప్రమాదానికి గురైన వారు దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన వారుగా స్థాని కులు తెలిపారు. వీరు హనుమకొండ జిల్లా కమలాపూర్ లోని బంధువుల వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుం దని సమాచారం. పరకాల పోలీసులను చరవాణిలో వివరాలు కోరగా.. ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కారు పల్టీ కొట్టి.. ఒకరు మృతి..