మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ :
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 16 ఏళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం. దమ్మాయిగూడకు చెందిన కాంతం వెంకటేష్ బావమరిది బి. గణేష్ (16) గత రెండు వారాల క్రితం తన మేనమామ చికిత్స నిమిత్తం దమ్మాయిగూడకు వచ్చాడు.ఈ నెల 12 వ తేదీ (మంగళవారం) ఉదయం సుమారు 9:40 గంట లకు గణేష్ తిరిగి తన స్వగ్రామమైన శాద్‌నగర్ కు వెళ్తానని చెప్పడంతో, వెంకటేష్ స్నేహితుడు శ్రీకాంత్ అతడిని ఈసీఐఎల్ బస్ స్టాప్ సమీపంలోని సతీరెడ్డి వీధి వద్ద దింపాడు. అయితే, సాయంత్రం వరకు గణేష్ ఇంటికి చేరు కోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోయింది. వేసవి సెలవుల్లో ఇంటికి వెళ్లడం ఇష్టం లేకపోయినా, తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు బయలుదేరిన గణేష్ ఎక్కడికి వెళ్లాడో తెలియక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాధితుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కుషాయిగూడ ఎస్‌హెచ్‌ఓ ఎల్. భాస్కర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

