బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

బీసీ ఏ కులాలు మేల్కొనండి

జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించండి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

తెలంగాణ బి సి ఏ హక్కుల పరిరక్షణ సమితి కోశాధికారి,తెలంగాణ గంగపుత్ర యువత అధ్యక్షులు అంబటి సుధాకర్ బి సి ఏ కులాలను, గంగపుత్రులను జాగృతం చేయడంలో భాగంగా నర్సంపేట గంగపుత్ర సంఘానికి హాజరై నర్సంపేట గంగపుత్ర సంఘం అధ్యక్షులు గుంటి సంజీవ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ గంగపుత్ర జాతీయులు మేల్కోవాల్సిన అవసరం ఉందని అనాదిగా మన కులం నిరాదారాణాకు గురవుతున్నదని ఇప్పటికే ముదిరాజులు మన కులాన్ని ఐజాక్ చేశారని చేపలు పట్టుట గంగపుత్రుల కులవృత్తి,తాత ముత్తాతల నుండి చేపలు పట్టుకొని జీవిస్తున్న వాళ్ళము మనమైతే చెరువులలో మనకు సభ్యత్వం లేకుండా చేశారని, ప్రభుత్వం చేపల చెరువులలో సభ్యత్వాలు చెరువులపై హక్కులు మనకే కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ మధ్యన బీసీఏ కులం లోకి రావడానికి ముదిరాజుల ప్రయత్నిస్తున్నారని, బీసీఏలో ఉన్న 57 కులాల జనాభాతో పోల్చుకుంటే వారి జనాభా సమానంగా ఉంటుందని, జనాభా పరంగా వారు ఎక్కువ సంఖ్యలో ఉండటం వలన బీసీఏ లో ఉన్న కులాల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని అన్నారు. అందుకే బిసి ఏ లో ఉన్న కులాలు మేలుకోవాల్సిన అవసరం ఉందని తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. జనాభా లెక్కల్లో కూడా గంగపుత్ర జాతిని ప్రభుత్వం చూపెట్టలేదని తక్షణమే గంగపుత్రులను చూపెట్టాలని అన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాలలో ఇప్పటికే వెనుకబడి ఉన్నామని ముదిరాజులను బీసీ ఏ లో కలిపితే మన పిల్లలు వెనుకబడి పోతారని తెలిపారు. ఆర్థికంగా ముదిరాజులు బలంగా ఉన్నారని వారిని బీసీ ఏ లో కలపద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు, ఎర్రబోయిన కిషన్, జీజుల సాగర్, మేదరబోయిన సత్యనారాయణ, చింతల టార్జాన్,అంకాల సాంబయ్య,అంకాల సుదర్శన్, అంకాల మల్లికార్జున్, గుంటి శ్రీనివాసు పెద్దపెళ్లి కేదారి, పూస యాకాంబరం, తదితరులు పాల్గొన్నారు.