మన ప్రగతి న్యూస్/ ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం చెకుముకి సైన్స్ సంబరాల్లో భాగంగా మండల స్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో ఉప్పునుంతల మండలంలోనీ జడ్.పి.హెచ్.ఎస్ కంసాన్పల్లి ,కేజీపివీ ఉప్పునుంతల మరియు జడ్.పి.హెచ్.ఎస్ ఉప్పునుంతల పాఠశాలలో ఎనిమిదవ తొమ్మిదవ పదవ తరగతిలో ఏడవ తారీఖున జరిగిన స్కూల్స్ స్థాయిలో ఎంపికైన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.సత్యనారాయణ (ఉప్పునుంతల ఇంచార్జ్ హెచ్ఎం). మల్లికార్జున కంసానీపల్లి(ఇంచార్జ్ హెచ్ఎం). మరియు ఉప్పునుంతల పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.