Breaking News

జర్నలిస్టుల కేసుల్లో న్యాయ రక్షణకు ప్రత్యేక న్యాయ నిధి ఏర్పాటు చేయాలి -ఎన్‌యూజే (ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నారగౌని డిమాండ్

పెద్దపల్లి జిల్లా నూతన అధ్యక్షుడిగా వడ్డేపల్లి రవీందర్, ప్రధాన కార్యదర్శిగా టి. తిరుపతి గౌడ్ , కోశాధికారిగా ఇజ్జగిరి వెంకటేష్ తో పాటు 20మందితో జిల్లా కార్యవర్గం ఎన్నిక

సంకట స్థితిలో స్థానిక పత్రికలు. చిన్న పత్రికల బలోపేతానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి

లక్షలాది మంది ఆధారపడి ఉన్న పత్రిక, మీడియా రంగాన్ని ఆదుకోవడాని ప్రెస్ అండ్ మీడియా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

మన ప్రగతి న్యూస్/ పెద్దపల్లి

విధి నిర్వహణ లో జర్నలిస్టుల పై అక్రమ కేసులు విరివిగా నమోదు అవుతున్న నేపథ్యంలో కేసుల నుంచి రక్షణకు ప్రత్యేక న్యాయ నిధి ఏర్పాటు చేసి జర్నలిస్టులను ఆదుకోవాలని
ఎన్‌యూజే (ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు, తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఫౌండర్ పురుషోత్తం నారగౌని డిమాండ్ చేశారు.
తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ పెద్దపల్లి జిల్లా జర్నలిస్టుల కమిటీ సమావేశం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తోకల అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్బంగా నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నారగౌని మాట్లాడుతూ, జర్నలిస్టుల రక్షణ కోసం జర్నలిస్టు రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు పరచాలని అన్నారు.. జర్నలిస్టులపై దాడులు, వేధింపులు, మరియు తప్పుడు కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే చట్టం తీసుకురావాలని కోరారు.
సమావేశంలో మంచిర్యాల సీనియర్ రిపోర్టర్ రాజ్ పటేల్, టీ. ఎస్. జే.యు. ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కందికొండ మోహన్, భూపాలపల్లి నాయకులు గట్టు రవీందర్ గౌడ్ హాజరయ్యారు.

ప్రధాన డిమాండ్లు:

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం
  1. చిన్న పత్రికలను తక్షణమే గుర్తించి, వాటిని ఎమ్పానెల్‌మెంట్‌లో చేర్చాలని కోరారు.

2.సంక్షేమ పథకాలలో యూనియన్ల జోక్యం లేకుండా చూడాలి
జర్నలిస్టుల సంక్షేమ పథకాలు నేరుగా అమలు చేయాలని, యూనియన్ల జోక్యం లేకుండా వ్యవస్థను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.

3.మీడియా రంగానికి ప్రత్యేక పాలసీ రూపొందించి, జర్నలిస్టుల భద్రత, పత్రికా స్వేచ్ఛకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు.

  1. మీడియా ఉద్యోగుల సంక్షేమం
    జర్నలిస్టుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన బీమా, పెన్షన్, మరియు ఇతర ఆర్థిక సహాయ కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు.

జిల్లా కార్యవర్గం :
అధ్యక్షుడు వడ్డేపల్లి రవీందర్, ఉపాధ్యక్షులు: కే రాజమల్లు, కే సురేష్, ఆర్ రాజు, పి. లక్ష్మీ నారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా టి తిరుపతి గౌడ్, ఆర్గనైజేషన్ సెక్రటరీగా కే.హరీష్, కే రవీందర్, బి. కుమార్ గౌడ్, డి. వెంకట్, సంయుక్త కార్యదర్శులుగా డి శ్రీనివాస్, ఏ ప్రసాద్, టీ సతీష్, బి సురేష్, కోశాధికారిగాఇజ్జగిరి వెంకటేష్, కార్యవర్గ సభ్యులుగా టి తిరుమలేష్, జి లవన్ కుమార్, ఒడ్నాల తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

జర్నలిస్టు సంక్షేమానికే పాటుపడతాం . పెద్దపెల్లి జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులు వడ్డేపల్లి రవీందర్, తిరుపతి గౌడ్

సంక్షే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పెద్దపల్లి జిల్లా పాత్రికేయ సమాజ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ పెద్దపల్లి జిల్లా నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన వడ్డేపల్లి రవీందర్, తిరుపతి గౌడ్ లు అన్నారు. తమపై నమ్మకం ఉంచి తమపై ఈ బాధ్యతను పెట్టిన పెద్దపల్లి జిల్లా జర్నలిస్టు సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు