Breaking News

వసతి గృహాల నిర్వహణ పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

మండల ప్రత్యేక అధికారులు వసతి గృహాలను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలి

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో

కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, అన్ని వసతి గృహాల ఇన్చార్జిలతో వసతి గృహాల నిర్వహణ పై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కే.వీర బ్రహ్మచారి తో కలిసి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలాలను ప్రతినిత్యం సందర్శిస్తూ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఉన్న 126 సంక్షేమ గృహాలు లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని,
చలికాలం దృశ్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్య, వైద్యం, సానిటేషన్, మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందిస్తూ, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యా బోధనలు అందించాలని సూచించారు. హాస్టల్లో రాత్రి వేళల్లో విద్యుత్ నిరంతరం ఉండే విధంగా చూడాలని ,పాములు, విష పురుగులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థిని, విద్యార్థులలో పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని, షెడ్యూల్ ప్రకారం వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు.
వంటశాలలో సిబ్బంది పరిశుభ్రంగా ఉండే విధంగా సంబంధిత వార్డెన్లు చూసుకోవాలన్నారు.
స్థానాల గదులు, డైనింగ్ హాల్, స్టడీరూమ్స్, మరుగుదొడ్లు, పరిశుభ్రత పాటించే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు.మండలాల ప్రత్యేక అధికారులు వసతి గృహాల తనిఖీ,ఇతర అభివృద్ధి పనుల పురోగతి పై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో తొర్రూరు, మహబూబాబాద్ ఆర్డివోలు గణేష్, కృష్ణవేణి, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన్ రాజు, జడ్పీ సీఈవో పురుషోత్తం,డిసిఓ వెంకటేశ్వర్లు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నరసింహస్వామి, గ్రౌండ్ వాటర్ డిడి వేముల సురేష్, డిహెచ్ఓ మరియన్న, డి ఏ ఓ విజయనిర్మల, డిటిడబ్ల్యుఓ సైదా, మండలాల ప్రత్యేక అధికారులందరూ పాల్గొన్నారు.