- మండలంలో విచ్చలవిడిగా మద్యం సరఫరా
- వైన్ షాపుల నుండి బెల్ట్ షాపులకు జోరుగా మద్యం తరలింపు
- పట్టించుకోని ఆబ్కారీ అధికారులు
- నష్టపోతున్న మందుబాబులు
మన ప్రగతి న్యూస్ /
రఘునాథపల్లి:
తాగేందుకు నీటికి కరువు కావచ్చు కానీ మద్యానికి మాత్రం తాగేందుకు కరువు లేకుండా బెల్ట్ షాపులలో విరివిగా దొరుకుతుంది.
రఘునాథపల్లి మండలం లోని 36గ్రామాలలో వైన్స్ షాప్ యజమానులు ఇష్టారాజ్యంగా పోటీపడుతూ బెల్ట్ షాపులను పంచుకొని మద్యం సరఫరా చేస్తున్నట్టు సమాచారం. ఇదంతా జరుగుతున్న ఆబ్కారీశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తున్నారా అనే ఆరోపణలు వస్తున్నాయి. బెల్ట్ షాపులపైన తనఖీలు చేయలేక మామూళ్ళు అందుకుంటున్నారని ఆబ్కారీ అధికారుల గురించి సామాన్య ప్రజలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.
పలు గ్రామాలలో బెల్ట్ షాపులకు స్టికరింగ్ వేసి మరీ దర్జాగా విక్రయిస్తున్నారు. అయినా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదని అనుకుంటున్నారు. ఇదే అదనుగా చేసుకుని బెల్ట్ షాప్ వ్యాపారులు ఒక బాటిల్ పైన రూ.40 నుండి రూ.50 వరకు దోచుకుంటున్నారు. తనఖీలు లేనందువల్ల నిర్లక్ష్యముగా అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు , అనుమానాలు ప్రజల నుండి వస్తున్నాయి.. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు ఆబ్కారీ శాఖ అధికారులు స్పందించి వెంటనే మద్యం విక్రయాల పైన నిఘా పెట్టి బెల్ట్ షాపులు గురించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా పాలన ప్రభుత్వాన్ని రఘునాథపల్లి మండల ప్రజలు, మహిళలు కోరుతున్నారు..