Breaking News

కొండపోచమ్మ ను దర్శించుకున్న ఎమ్మెల్సీ యాదవ రెడ్డి.

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం లోని తిగుల్ నర్సాపూర్ గ్రామ సమీపంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయం లో 23 వ వార్షికోత్సవం లో భాగంగా చివరి రోజు అయినా శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యెక పూజలు చేశారు.అనంతరం ఆలయ నిర్వాహకులు శాలువా తో ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ కొండపోచమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వారి వెంట కొండపోచమ్మ మాజీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,గజ్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ రాజమౌళి,మాజీ ఎంపీటీసీ కావ్య దర్గయ్య,మహిళా మండల అధ్యక్షురాలు కవిత కొండపోచమ్మ మాజీ డైరెక్టర్ కనకయ్య, గ్రామ బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షులు స్వామి,నాయకులు బిక్షపతి,సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.