Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా అధికారి

రామచంద్రపురం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా సహకార అధికారి.

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

ములకలపల్లి మండలంలోని పిఏసిఏస్ సంఘ పరిధిలోగల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రామచంద్రపురం సెంటర్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహకార అధికారి సయ్యద్ ఖుర్షిద్ సందర్శించి సెంటర్ ఇన్చార్జిలకు మరియు రైతులకు పలు సూచనలు చేశారు. అలాగే నాణ్యత ప్రమాణాలకు లోబడి రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికీ తీసుకురావాలని కోరారు. రైతులకు ధాన్యం కొనుగోలు సంస్థలకు మద్య సమన్వయం ఉండాలని కోరారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఇన్స్పెక్టర్ వరుణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ పి మధుసూదన్, సంఘ సెక్రటరీ కుంచారపు శ్రీనివాసరావు, సంఘ డైరెక్టర్ జే గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.