Breaking News

26న జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.

రైతులందరికీ పూర్తిగా పంట రుణాలను మాఫీ చేయాలి.

నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేయాలి.

జిల్లా సంయుక్త కిషోర్ మార్చ జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపు.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన ప్రగతి న్యూస్ /ములకలపల్లి

ములకలపల్లి: ఈనెల 26న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సంయుక్త కిషన్ మార్చ జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ నాయకులు కల్లూరి కిషోర్, ముదిగొండ రాంబాబు, నరాటి రమేష్, పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే దేశ ప్రజలు రైతులు కార్మికులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ రైతులందరికీ పూర్తిగా పంట రుణాలను మాఫీ చేయాలని డివైడ్ చేశారు. కార్మికులందరికీ కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్స్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని రక్షణ రైల్వే ఆరోగ్యం విద్య విద్యుత్ ప్రవేటికరించవద్దని గృహాలకు ఉచిత విద్యుత్ 300 యూనిట్స్ వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి పథకాన్ని 200 రోజులకు పెంచాలని రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని పెండింగ్ బకాయిలను వెంటనే ఇవ్వాలని పట్టణ ప్రాంతాలకు గ్రామీణ ఉపాధి పథకాన్ని విస్తరింప చేయాలని అన్నారు. నిత్యవసరలపై అధిక ధరలు తగ్గించి ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ట పరచాలని డిమాండ్ చేశారు. మతాల మధ్య విభజన ఆపి రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక సాంప్రదాయాలను కాపాడాలని డిమాండ్ చేశారు. మహిళలపై చిన్న పిల్లలపై దళితులపై గిరిజనులపై మైనార్టీలపై జరుగుతున్న దాడులను హత్యలను అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు వానాకాలం,యాసంగి పంటల ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఊకంటి రవికుమార్, నిమ్మల మధు, నకిరేకంటి నాగేశ్వరరావు, బైరు సాయిబాబు,వాకుండోతు వీరు, తదితరులు పాల్గొన్నారు.