Breaking News

వడ్ల కొనుగోలు కేంద్రాలు తెరిచేది ఎప్పుడు

దిగాలుగా కల్లాల ముందు కూర్చొని చూస్తున్న రైతులు

10 నుండి 15 రోజుల నుండి కల్లాలలో ఆరబెడుతున్న రైతులు

ఎక్కువగా ఎండడం వలన తాలుగా మారి తక్కువ అవుతాయని రైతుల ఆందోళన

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి

మండలంలోని రైతులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ప్రారంభిస్తారని ఎదురుచూస్తున్నారు. వరి కోతలు నెల రోజులు కావస్తున్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 నుండి 15 రోజులు అయినా కాంటాలు వేయకపోవడం వలన కల్లాలలో ఉన్న వడ్లు ఎక్కువగా ఎండడం వలన బరువు తగ్గి వడ్లు తాలు అవుతాయేమోనని రైతులు దిగులుగా ఉన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందో లేదా అని కొంతమంది రైతులు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వం మాట నిలుపుకోవాలనిరైతులు కోరుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మండల రైతులు వేడుకుంటున్నారు.