మనప్రగతి న్యూస్/ జగదేవపూర్ ప్రతినిధి
జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని డిసెంబర్ 14 తేదీన గజ్వేల్ కోర్టు ఆవరణలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఆడిషనల్ సివిల్ జెడ్జ్ మండల సేవాధికార సంస్థ చైర్మన్ బి.ప్రయాంక పేర్కొన్నారు పోలీస్ వారితో సమన్వయ సమావేశంలో వారు మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్తానం సుప్రీం కోర్టు పిలుపుమేరకు జాతీయ లోక్ అదాలత్ లో రాజిపడదగ్గ కేసుల పరిష్కారం ద్వారా సత్వర మరియు సమన్యాయం కొరకు లోక్ అదాలత్ చక్కని వేదికని వారు అభివర్ణించారు కావున కక్షిదారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోనేందుకు పోలీస్ విభాగము సంబందిత అధికారులు కృషిచేసి ఎక్కువ మందికీ న్యాయం చేసేందుకు ముందుకు రావాలన్నారు
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబంది కోర్ట్ సిబంది మండల లీగల్ సర్వీస్ సిబ్బంది నర్సింహా చారి కోర్ట్ సిబంది తదితరులు పాల్గొన్నారు