Breaking News

మీ వాహనాలపై ఆ స్టిక్కర్లు ఉన్నాయా? ఇక జైలుకే!

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి

చాలా మంది వాహనాలపై రకరకాల స్టిక్కర్లు ఉంటాయి. కార్లు, బైకులు, ఆటోలు ఇంకా ఇతర వాహనాలు ఏమి కొన్నా కానీ వాటిపై అనేక రకాల స్టిక్కర్లు అంటించుకొని తిరుగుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల స్టిక్కర్లు అంటించుకుంటే మాత్రం ఇక శిక్షలు తప్పవు. ఇంతకీ ఆ స్టిక్కర్లు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం

మనలో చాలా మంది కూడా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ, ఎమ్మెల్యే అని అనాధికారిక స్టిక్కర్లు తమ వాహనాలపై అతికించుకుంటారు. ఇలాంటి స్టిక్కర్లు అతికించుకొని ఉంటే కచ్చితంగా తీసి వేయండి. ఎందుకంటే ఇవి ఉంటే క్రిమినల్ కేసులు తప్పవని అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు.. కొంతమది ఈ స్టిక్కర్లను అతికించుకొని చెడ్డ పనులకు పాల్పడుతున్నారని అధికారులు గుర్తించారు.అందుకే ఇలాంటి వారిపై ఫోకస్ పెట్టారు. ఎవరైనా ఎమ్మెల్యే ఆన్ డ్యూటీతో ఉన్నటువంటి స్టిక్కర్లు అతికించుకొని తిరుగుతుంటే వారిపై ఎంవీ ఆక్ట్ ప్రకారం ఇకపై కేసులు పెట్టనున్నారు. ఇలా అనధికారిక స్టిక్కర్లు అంటించుకొని వాహనాలు నడిపితే కచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు. గతంలో కొంతమంది వాహన యజమానులు ప్రభుత్వ ఉద్యోగులకు కార్లను అద్దెకు ఇచ్చేవారు. అయితే ఆ కార్లపై ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని స్టిక్కర్లు అతికించే వారు. ప్రస్తుతం వారికి కార్లని అద్దెకు ఇవ్వకపోయినా అదే స్టిక్కర్ అతికించుకొని కార్లను నడుపుతున్నారు. కారుపై గవర్నమెంట్ ఆన్ డ్యూటీ స్టిక్కర్లు పెట్టుకొని ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఉల్లంఘన కిందకు వస్తుందని ట్రాఫిక్ ఉన్నతాధికారులు వార్నింగ్ ఇస్తున్నారు.

రీసెంట్ గా హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ పరిధిలో ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఓ కాస్ట్ లీ కారును ట్రాఫిక్ పోలీసులు చెక్ చేశారు. ఆ కారు లోపల ఏకంగా సైరన్ కూడా ఉంది. ఆ కారులో ఎమ్మెల్యే గాని ఆయన కుటుంబం సభ్యులు కానీ ఎవరూ లేరు. దీంతో పోలీసులు ఎంక్వైరీ చేయగా వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారని తేలింది. ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి చెడ్డ పనులు చేయడం, అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో ఆ కార్ యజమానిపై కేసు ఫైల్ చేశారు. ఇక నుంచి వాహనాలపై ఇలాంటి స్టిక్కర్లు ఉంటే మోటరు వెహికల్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా ఫిల్ చేస్తామని ట్రాఫిక్ ఉన్నత అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఇలాంటి స్టికార్లు మీ వాహనాలకు ఉంటే కచ్చితంగా తీసేయండి. జాగ్రత్తగా ఉండండి.