Breaking News

రైతులు అందరికిరుణమాఫీ ఎప్పుడో..?

  • రైతుల్లో అయోమయం
  • మాఫీ కావాలంటే.. మళ్లీ అప్పు చేయాల్సిందేనా!

మన ప్రగతి న్యూస్ /
రఘునాథపల్లి :

ఏకకాలంలో రుణమాఫీ వర్తిస్తుందని ఆశించిన
రఘునాథపల్లి మండలంలోని అన్ని గ్రామాల రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. అధికారంలోకి వచ్చి 11 నెలలు గడిచిన పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ ఫలాలను అందించలేక పోతుందనే విమర్శలను ప్రజాపాలన ప్రభుత్వం ఎదుర్కొంటోంది. రూ. 2 లక్షలకు మించి బ్యాంకుల్లో రుణం ఉన్నవారు పై మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తే తాము రైతుల ఖాతాల్లో మాఫీ సొమ్ము జమ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రివర్గ సభ్యులు అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. దీంతో రూ. 2 లక్షలకు పైన ఉన్న మొత్తాన్ని రైతులు అప్పులు తీసుకువచ్చి బ్యాంకుల్లో కట్టారు. అయితే ఇప్పటి వరకు రూ. 2 లక్షల మాఫీ సొమ్ము విడుదల కాలేదు. అలాగే రేషన్‌ కార్డులు లేనివారికి ఫ్యా మిలీ గ్రూపింగ్‌ (సర్వే)ను పూర్తి చేసినప్పటికీ వారికీ మాఫీ వర్తించలేదు.
ప్రస్తుత కాం గ్రెస్‌ సర్కారు హయాంలో సైతం రుణమాఫీ అర్హులందరికి అందకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఎప్పుడు అందుతుందా అని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.
రూ.2 లక్షల వరకు అరకొరగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం రూ.2 లక్షలకు పైగా రుణం పొందిన రైతుల పరిస్థితి ఏంటనేదానిపై స్పష్టత ఇవ్వడంలేదు. వీళ్లకు రుణమాఫీ ఎప్పటి నుంచి.. ఏ విధంగా చేస్తారనే అంశంపై స్పష్టత కొరవడింది. దీంతో 2 లక్షల వరకే మమా అనిపించేసి ఆపై రుణరైతులకు మొండి చేయి చూపిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీనికి తోడు ఇప్పటికే రుణమాఫీ మొత్తం పూర్తి చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మరింత ఎక్కువై అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అధికారులు ఏ విషయం చెప్పలేక చేతులెత్తుస్తున్నారు.దీంతో 2 లక్షలకు దాటిన రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది.
రుణమాఫీ కోసం రైతులు వ్యవసాయ శాఖ అధికారు లను ప్రశ్నిస్తే వారికి ఎలాంటి సమాధానం దక్కడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు కేవలం ఫ్యామిలీ గ్రూపింగ్‌ చేయడం వరకే పరిమితమయ్యారు. రుణమాఫీ సొమ్ము జమయ్యే అంశం తమ పరిధిలో లేదని అధికారులు చెబుతున్నారు. రుణమాఫీపై స్పష్టత రావడం లేదు.

అదనపు రుణం చెల్లింపు ఎందుకు…?

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం

రూ. 2 లక్షలు రుణమాఫీ కావాలంటే ఆపైన రుణం ముందుగా చెల్లించాలనే నిబంధనపై రైతులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కండీషన్‌ పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేయదల్చుకుందో ఆ మొత్తం చేయకుండా రైతులతో లింకు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని రైతుల బాధ్యతకు వదిలేయాలి గానీ ఇప్పుడే చెల్లించాలంటూ పీకల మీద కత్తిపెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిబంధనతో రైతులు మళ్లీ అప్పుల కోసం ప్రైవేటు వ్యాపారుల వద్దకు పరుగులు తీస్తున్నారని తెలిపారు. ఒక్కొక్కరు రూ. 5 అంతకు మించి వడ్డీతో అప్పులు తీసుకొస్తున్నారని తెలిపారు. రైతులు అంత చేస్తున్నా ప్రభుత్వం నుంచి 2 లక్షలకు పైగా రుణమాఫీ ఎప్పుడు చేస్తారో స్పష్టత లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. రైతులకు ఇప్పట్లో నిధులు మంజూరు చేస్తే యాసంగి సీజన్‌ సాగు పెట్టుబడి, ఇతర అవస రాలకు ఎంతో ఊరట లభిస్తుంది. ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా మాఫీ సొమ్మును రైతులకు విడుదల చేయాలి అని ప్రజాపాలన ప్రభుత్వాన్ని, అధికారులను రఘునాథపల్లి మండలంలోని రైతులు కోరుతున్నారు.