Breaking News

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమైక్య (టీఎస్ యుటిఎఫ్) అధ్యక్షుడిగా కాపుల హరినాథ్ బాబు

మన ప్రగతి న్యూస్/ అశ్వరావుపేట నియోజకవర్గ ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ సంఘం మండల 11వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది, మండల అధ్యక్షుడిగా కాపుల హరినాథ్ బాబు, ఉపాధ్యక్షులుగా బి రవికుమార్ మరియు కె విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లు, కోశాధికారిగా కే మధు తో పాటు పలువురిని ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమం ఉద్దేశించి నూతన అధ్యక్షులు హరినాథ్ బాబు మాట్లాడుతూ విద్యారంగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమైక్య నిరంతరం పనిచేస్తుందని, అన్నివేళలా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం దిశగా ఈ సంఘం అందుబాటులో ఉంటుందని, మరియు నూతనంగా ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులకు ఇంకా ప్రాన్ నెంబర్లు రాలేదని, ఉద్యోగంలో చేరి ఇంచుమించు రెండు నెలలు కాబోతున్న నూతన ఉపాధ్యాయులు ఇంకా జీతానికి నోచుకోలేదని విచారం వ్యక్తం చేశారు.
నూతన ఉపాధ్యాయులకు త్వరగా ప్రాన్ నెంబర్లు వచ్చే దిశగా సంబంధిత శాఖపై ఒత్తిడి తెస్తామని, త్వరలో ప్రాన్ వచ్చేలా చేస్తామని తెలియజేశారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం


ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమైక్య సంఘ సభ్యులు అశ్వరావుపేట మండలం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు