
BIG BREAKING
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఉమ్మండి వరంగల్ జిల్లాలో..
ఉమ్మడి వరంగల్జి ల్లా వ్యాప్తంగా పలుచోట్ల భూమి కంపించింది. వరంగల్, హనుమకొండ నగరంతో పాటు.. జనగామ, నర్సంపేట, భూపాలపల్లి, ములుగు, పరకాల, పాలకుర్తి, మరిపెడ, ఏటూరునాగారంలో భూకంపం వచ్చింది. ఉ.7:25 నుంచి 7:30ల మధ్య దాదాపు 3 నుంచి 5 సెకన్ల పాటు భూపి కంపించింది. ములుగులో అత్యధికంగా 5.3 సెకన్ల పాటు కంపించింది. దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. మీ ప్రాంతంలో వస్తే కామెంట్ చేయండి.
తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి!
బుధవారం ఉదయం 7.27 గంటలు. తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు ప్రారంభమైన సమయం. 2- 5 సెకన్ల వరకు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అత్యధికంగా తెలంగాణలోని ములుగు కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత కనిపించింది. ఎప్పుడైనా అక్కడక్కడా భూప్రకంపనలు వస్తుంటాయని, కానీ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి చాలా చోట్ల భూమి కదలడం భయానికి గురిచేసిందని ప్రజలు చెబుతున్నారు.