01,04, 833/- రూపాయలు స్వాధీనం
సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, జగదేవపూర్ పోలీసులు వెళ్లి రైడ్ చేయగా 08 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1,04,833/- వేల రూపాయలు, 09 మొబైల్ ఫోన్లు, 1 మోటార్ సైకిల్, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు
జగదేవపూర్ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.
పేకాట ఆడిన వారి వివరాలు
1 భీమ్ యెల్లం తండ్రి మల్లయ్య, గ్రామం రిమ్మనగూడ.
2 సామల కుమార్ తండ్రి రాములు,గ్రామం మునిగడప
3 కర్రే రాము తండ్రి నర్సింలు, గ్రామం రాంపూర్ మండలం చేగుంట
4 వట్టిపల్లి శ్రీనివాస్ తండ్రి లక్ష్మణ్, నివాసం జోగిపేట్
5 చిత్తరాల యాదగిరి తండ్రి పెంటయ్య, నివాసం జోగిపేట్
6 కొంపల్లి నర్సింలు తండ్రి హనుమయ్య,నివాసం జోగిపేట.
7 విరపట్నం స్వామి తండ్రి జోగయ్య, నివాసం గొల్లపల్లి
8 జెపల్ల రాములు తండ్రి రాజయ్య, నివాసం రిమ్మనగూడ,
పారిపోయిన వారి వివరాలు*
9 మధు, నివాసం మల్లారం
10 ప్రవీణ్
11 పోచయ్య నివాసం మల్లారం
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు, గజ్వేల్ పోలీసులు మాట్లాడుతూ గ్రామాలలో, పట్టణాలలో ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు