-పి .వై. ఎల్ జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ వెల్లడి .
-యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు.
మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
నిరుద్యోగం, వైద్యం ,డ్రగ్స్ సమస్యల పరిష్కారం కై ఈనెల 16 న పి వైఎల్ ఆధ్వర్యంలో జరుపతలపెట్టిన’ చలో అసెంబ్లీ’కార్యక్రమంలో యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర అధ్యక్షుడు సాగర్, సహాయ కార్యదర్శి బేజాడి కుమార్ లు పిలుపునిచ్చారు.
ప్రగతి షీలాయువజన సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం నాడు జిల్లా అధ్యక్షుడు అయిన సాదుల శ్రీకాంత్ అధ్యక్షతన భూదాన్ పోచంపల్లి లో జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తూ వెళ్లే పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్య ,వైద్యం ,ఉపాధి అవకాశాలు ఎండమావిగా మారాయి అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్బంధం కొనసాగిందని, ఫలితంగా ఆ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని, కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారని అన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం ప్రజలకు దూరమైందని, ప్రైవేట్ వైద్యం భారంగా మారిందని అన్నారు.
ప్రభుత్వ దవాఖానాలలో కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రజలు ప్రైవేట్ వైద్యానికి వెళితే పీల్చి పిప్పి చేస్తున్నారని, దోపిడీ చేస్తున్నారని అన్నారు.
నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదని రెండు లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి, భర్తీ చేయాలన్నారు.
అసెంబ్లీలో చర్చ జరిపి ఉద్యోగ ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేసి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ నీటి బుడగల మారిందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో డ్రగ్స్ ,గంజాయి, మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయని చాలామంది యువత వీటి మూలంగా జీవితాలను కోల్పోతున్నారని అన్నారు.
హింసకు ప్రధాన కారణం మత్తు పదార్థాలు అన్నారు. ఈ 3 ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కారం చేయని యెడల ఈనెల 16న అసెంబ్లీ ముట్టడి చేపడుతామని హెచ్చరించారు.
యువత పెద్ద ఎత్తున పాల్గొ నా లని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా నాయకుడు పగడాల శివ సిహెచ్ బాలకృష్ణ వెంకటేష్ ,ఏ. కృష్ణ ,మోహన్ రెడ్డి ,నవీన్ ,కిషోర్, బుచ్చయ్య, బాల నరసింహ ,తదితరులు పాల్గొన్నారు.