Breaking News

జెడ్ పి హెచ్ ఎస్ లో సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం

మన ప్రగతి న్యూస్/సంగెం

క్రీడలు శారీరక వ్యాయామానికి, ఉద్యోగ అవకాశాలకు దోహదపడుతాయి
సంగెంమండల అభివృద్ధి అధికారి కె. రవీందర్
సంగెం : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమం మండల విద్యాధికారి (జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు )రాము అధ్యక్షతన జరిగినఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల తహసిల్దార్ రాజ్ కుమార్, అతిధులుగా మండల అభివృద్ధి అధికారి రవీందర్ హాజరై మాట్లాడుతూ క్రీడలు శారీరక వ్యాయామంతో పాటు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు దోహదపడతాయన్నారు. మంగళవారం రోజున వాలీబాల్ క్రీడాంశంలో పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ పోటీలలో మండలంలోని వివిధ గ్రామస్థాయిల నుండి 13 జట్లు పాల్గొన్నాయి. బుధవారం కబడ్డీ పోటీలు, గురువారం అథ్లెటిక్స్ యోగ పోటీలు జరగనున్నాయి. ఈ క్రీడలను జిల్లా యువజన క్రీడా అధికారి సత్యవతిపర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మెట్టుపల్లి రమేష్, ఆగపాటి రాజు, పులి సాంబయ్య, సంగెం మండల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఏలియా సబ్ ఇన్స్పెక్టర్ నరేష్,సదిరంకుమారస్వామి,సంగెం హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ శ్రీధర్, మండలంలోని వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, పురుషులు,మహిళలు,విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం