క్రీడలతోపాటు విద్యలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి
మాజీ మంత్రి దయాకర్ రావు
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:
జాతీయస్థాయి టెన్నిస్, వాలీబాల్ పోటీలకు గుగులోతు శోభన్ ఎంపిక కావడం అభినందనీయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇటీవలే జనగామలో జరిగిన రాష్ట్రస్థాయి క్రీడల్లో మండలం లోని మల్లంపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థి గుగులోతు శోభన్ ఎంపిక కావడంతో మంగళవారం మాజీ మత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శోభన్ ను
ఘనంగా సన్మానించి అభినందించారు. క్రీడలతోపాటు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కలలను నిజం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మండల కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, మాజీ సర్పంచ్ ఇమ్మడి ప్రకాష్, నాయకులు ఘనపురం సురేష్, పోశాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.