Breaking News

బహుళార్థక ప్రాజెక్టు కు 70 వసంతాలు

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి

నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం జరిగి నేటికి 69 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం పైలాన్ పిల్లర్ దగ్గర ఉదయం చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 69 వ వసంతాల సంబరాల కార్యక్రమం లో సీఇ శ్రీధర్ రావు, ఏఇ ఇంజినీర్ మల్లికార్జున రావు, డిఇఇ శ్రీ నివాస్ రావు,జేఇ లు సత్యనారాయణ, నరసింహ మూర్తి, కృష్ణ మొదలైన వారు పాల్గొన్నారు.అంతకు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ రావు మాట్లాడుతూ నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం నేటికి 69 వసంతాలు పూర్తి చేసుకొని 70 వసంతంలో కి అడుగుపెట్టినందుకు చాల సంతోషంగా ఉందని ఆయన అన్నారు అలాగే భారతీయ ఇంజినీర్లు స్వయం సాంకేతిక పరిజ్ఞానానికి ప్రతిభా మేధా సంపత్తికి నిదర్శనం అని బావి తరాలకు ఆదర్శంగా నిలిచిందని దీనిని భారత దేశం మొట్టమొదటి ప్రధాని మంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ 1955 డిసెంబర్ 10 వ తేదిన నాగార్జున సాగర్ డ్యాం ను శంకుస్థాపన చేయటం జరిగిందని ఈ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయువుపట్టుగా ఉండి ఆధునిక దేవాలయంగా పేరు ప్రఖ్యాతలకు నిలయంగా పేరు తెచ్చుకుందని అన్నపూర్ణ గా పేరొంది కోట్లాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పింస్తుందని అలాగే మానవ నిర్మితమైన మహాద్భుత కట్టడం కృష్ణ నది పైన నిర్మించిన నాగార్జున సాగర్ డ్యామ్ ని ప్రపంచంలో అపూరూపమైన ప్రాజెక్టు గా ప్రపంచ దేశాలు సైతం కొనియాడుతాయని ఆయన అన్నారు, అలాగే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు గా 5 కోట్ల మంది కార్మికులు 13 ఏళ్ల పాటు శ్రమించి ఈ బహుళార్థక ప్రాజెక్టు నిర్మాణం కోసం పాటు పడి ఎందరో కార్మికులు ప్రాణ త్యాగం ఫలితంగా నిర్మాణం జరిగిందని వారి త్యాగ ఫలితంగా రూ 23 లక్షల ఎకరాలకు సాగునీరు, కొన్ని వేల గ్రామాలకు తాగునీటీ సౌకర్యం, పరిశ్రమలకు విద్యుత్ ఉత్పత్తి సౌకర్యం కలుగుతుందని ఈ జలాశయం విస్తీర్ణం 110 చదరపు మైళ్ళు కాగా, గరిష్ట నీటి మట్టం 590 అడుగులు, కుడి కాల్వను జవహర్ కాల్వ గా , ఎడుమ కాల్వ ను లాల్ బహదూర్ కాల్వ నామ కరణంగా పిలుస్తారని ఆయన అన్నారు ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు నవ ఆధునిక దేవాలయంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎఫ్ ఆర్ ఐ శ్రీనివాసరావు, ఎస్ ఐ రఘు బాబు, ఏఎస్ ఐ పుల్లయ్య, మహమ్మద్ ఎస్పీఎఫ్ సిబ్బంది మరియు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నాల్గవ తరగతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం