Breaking News

కంబాలపల్లి పాఠశాలకు పూర్వ విద్యార్థుల సాయం …..

మన ప్రగతి న్యూస్/
మహబూబాబాద్ బ్యూరో

మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986- 87 బ్యాచ్ పూర్వ విద్యార్థి , ఉపాధ్యాయుడు రామ సహాయం శ్రీధర్ రెడ్డి చొరవతో ప్రస్తుతం 2024-2025 విద్యా సంవత్సరంలో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక తరగతి లకు సాయంత్రం వేళలో స్నాక్స్ అందించుటకు రూ.10000 /- విరాళంగా మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ బాబు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు అందజేసిన విరాళాలతో సాయంత్రం వేళల్లో పదో తరగతి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించి మంచిగా చదువుకొని పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. అలాగే పాఠశాల పూర్వ విద్యార్థి, ఉపాధ్యాయుడు రామ సహాయం శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాలకు తన వంతుగా ఏదో ఒకటి చేయాలనే దృక్పథంతో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ లో ఆల్ఫాహారానికి ఈ నగదును వినియోగించమని ప్రధానోపాధ్యాయులను కోరారు.మరొ పూర్వ విద్యార్థి మేకల కృష్ణయ్య మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివినందుకు తమెంతో గర్విస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బొక్క వెంకట రెడ్డి, బెల్లం కొండ యాకయ్య, రాచకొండ రమేష్, ఉపాధ్యాయులు విష్ణువర్ధన్,సోహెన్ బీ ,కాసం శ్రీనివాసరావు, వి తిరుపతి, శిభరాణి,అల్లి సతీష్ కుమార్,సోమేశ్వర్ ఝాన్సీ ,మల్లారెడ్డి, యుగంధర్,కవిత, విద్యార్థిని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం