మన ప్రగతి న్యూస్ నర్మేట :
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు మండల బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.మాజీ ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ మాట్లాడుతూ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రములో తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం సరికాదని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు నిర్వహించి,ప్రజలకు మంచి చేయాలి గానీ 10 సంవత్సరాలు అందరికి నచ్చిన విగ్రహాన్ని మార్చడాన్ని తీవ్రంగా కండించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,మాజీ సర్పంచ్ లు రామిని శివరాజ్,జాల శ్వేత కిషన్,మంకెన ఆగిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు బావండ్లపల్లి రాజు, నాయకులు బేడుదాం సుధాకర్,మల్లేశం,కొంపెల్లి రాజు, జినుక రవీందర్, వస్పరి రాజు, గద్దల ఉపేందర్,నరేష్, జీవన్, యాదగిరి, నర్సింగరావు,గద్దల భాస్కర్,తదితరులు పాల్గొన్నారు.