మన ప్రగతి న్యూస్ / జనగామబ్యూరో :
బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాల యంలో ప్రతిష్టించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం జనగామ నియోజకవర్గంలోని అన్నీ మండలాల ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు జనగామలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాము చిత్రపటా లకు పాలాభిషేకం చేశారు ఈ సంద ర్బంగా వారు మాట్లా డుతూ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయ డంతో ఆనాడు యూపీఏ ప్రభుత్వం దిగొచ్చిందని 2009 డిసెంబర్ 9న ఆనాటి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిం దని బీఆర్‌ఎస్ నాయకులు గుర్తు చేశారు.
ఇది ఉద్య మాన్ని మలుపు తిప్పిన రోజు అని, స్వరాష్ట్ర సాకారానికి పునాది వేసిన రోజు అని అభివర్ణించారు. ప్రత్యేక తెలంగాణకు నాందిపడిన ఈ రోజును విజయ్ దివస్‌గా జరుపుకొం టున్నామనిచెప్పారు.
సకలజనుల సమ్మతితో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ రూపు రేఖలను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడా న్ని ఈసందర్బంగా తీవ్రంగా ఖండించారు.