Breaking News

బీఆర్ఎస్ పిలుపు మేరకుతెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

మన ప్రగతి న్యూస్/హత్నూర:

బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి ఆర్ పిలుపుమేరకు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, పంచామృతం తో ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి మంగళవారం అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి ఎందరో ఆత్మబలిదానాలను చేస్తే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రాణ త్యాగాన్ని లెక్కచేయకుండా ఆమరణ దీక్ష చేస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా కాంగ్రెస్ తల్లి విగ్రహం పెట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం అని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని రాజీవ్ గాంధీ విగ్రహాలను తొలగిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి, చంద్ర గౌడ్, నయీం ఉద్దీన్, జగదీష్ ,అమర్ సింగ్,రమేష్ గౌడ్ , బాబ్యానాయక్ , సంతోష్ రమణ గౌడ్ ,శేకర్, రామా గౌడ్ , మాజీ ఎంపీపీలు వావిలాల నర్సింలు , రాజు , హరి కృష్ణ, మజుల కాశీనాథ్ , అమర్ సింగ్ , సూరారం నర్సింలు , ఆగమయ్య, షేక్ హుస్సేన్, శివశంకర్ రావు , శ్రీకాంత్ ,వీరేందర్ ,తాజా మాజీ సర్పంచ్ లు జితేందర్ రెడ్డి ,సేనాపతి, రవి కుమార్ , శ్రీశైలం, సామ్యా నాయక్ , ప్రవీణ్ కుమార్ ,శ్రీనివాస్ రెడ్డి ,కిషోర్ ,ప్రతాప్ గౌడ్ ,నియోజకవర్గ మండల స్థాయి ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.