పిఎస్ సి డబ్ల్యూ యు. టి యు సి ఐ డిమాండ్
మన ప్రగతి న్యూస్ / సత్తుపల్లి ఆర్సీ
సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ కు వేతనాలు పెంచాలని తదితర డిమాండ్లపై ప్రోగ్రెసివ్ సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సత్తుపల్లి సింగరేణి బ్రాంచ్లో కరపత్రాల ద్వారా ఈరోజు మంగళవారం విస్తృత ప్రచారం చేయడం జరిగింది. జె వి ఆర్,కిష్టారం ఓసి పిఓ, జనరల్ మేనేజర్ కు ప్రతినిధి బృందం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సంఘం రాష్ట్ర కోశాధికారి సీవై పుల్లయ్య, రాష్ట్ర నాయకులు అమర్లపూడి శరత్ మాట్లాడుతూ, బెల్ట్ క్లీనింగ్ కార్మికులకు సెమీ స్కిల్డ్ వేతనాలు పెంచాలని,రైల్వే కాంట్రాక్టు కార్మికులకు స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని నర్సరీ కార్మికులకు కనీస వేతనాలు సీఎం, పిఎఫ్ వైద్యం తదితర చట్టచట్ట బద్ద హక్కు లు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సింగరేణి లాభాల బాటలో ఐదు వేల రూపాయలు సోలార్ కార్మికులకు, డిపార్ట్మెంట్లో కూడా మిగిలిపోయిన కార్మికులకు లాభాల వాటా చెల్లించాలని వారి డిమాండ్ చేశారు. సింగరేణి ప్రభుత్వ రంగ పరిశ్రమలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు 56 డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించకుండా సింగరేణి యాజమాన్యం శ్రమదోపిడి చేస్తున్నదనీ వారు విమర్శించారు. సింగరేణిలో వేలకోట్ల రూపాయలు లాభాలు వస్తున్నాయని చెప్తున్నా సింగరేణి యాజమాన్యం ఈ లాభాలకు కారకులైన కాంట్రాక్టుకార్మికుల వేతనాలు పెంపుదలలో మాత్రం నిర్లక్ష్యన్ని ప్రదర్శిస్తున్నదని వారు విమర్శించారు. ఎన్నికల్లో కాంట్రాక్టు కార్మికుల ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి సంవత్సరం కావస్తున్న దాని గురించి పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జీతాల పెంపుకై నిర్ణయం తీసుకొని సమాన పనికి సమాన వేతనం లేదా హెచ్చిసి వేతనం జీవో నెంబర్ 22 గెజిట్ ద్వారా ఒకటి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సింగరేణిలో డ్యూటీ కి రాకపోతే ఆబ్సెంట్గా పరిగణించాలి కానీ, పెనాల్టీలు వేసి ముక్కు పిండి కాంట్రాక్టర్లు కార్మికుల జీతాల నుండి కోత విధించడం సరైనది కాదని, నో వర్కు నోపే విధానాన్ని అమలు చేయాలని, పెనాల్టీలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.కట్ల ప్రసాద్ గీగా సురేష్,వై కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.