మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో
మంగళవారం ఐ.డి.ఓ.సి లోని మినీ సమావేశ మందిరంలో రెవెన్యు అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాల ఓటరు జాబితా డ్రాఫ్ట్ ప్రచురణ పై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు – 2025 ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ ప్రచురణ అన్ని గ్రామ పంచాయతీలలో ఈ నెల 7 వ తేదీన ప్రకటించనైనదని, నాటి నుండి డిసెంబర్ 12 వ తేదీ వరకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో ఆయా మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారులకు అభ్యంతరాలు ఇవ్వవచ్చని డిసెంబర్ 13 వ తేదీ న పోలింగ్ కేంద్రాల జాబితా అభ్యంతరాలు పరిష్కరించి జిల్లా కలెక్టర్ ఆమోదంతో తుది జాబితా డిసెంబర్ 17 వ తేదీన ప్రచురించబడునని, అదేవిధంగా డిసెంబర్, 12 వ తేదీన మండల స్థాయిలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు వివిధ రాజకీయ పక్షాల ప్రతినిదులతో సమావేశాలు నిర్వహించబడునని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, డి.ఎల్.పి.ఓ లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.