Breaking News

సీఎం కప్ క్రీడోత్సవాలలో భారతీయ విద్యా మందిర్ విద్యార్థుల ఉత్తమ ప్రతిభ

మన ప్రగతి న్యూస్/మరిపెడ:
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించనున్న సీఎం కప్ క్రీడోత్సవాలను మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో 7, 8 వ తేదీలలో మరిపెడ మండలంలో 10,11,12 తేదీలలో కబడ్డీ,కోకో,వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడలు నిర్వహించిన విషయం తెలిసిందే . ఆటల పోటీలలో మరిపెడ మండలం అనేపురం స్టేజి వద్ద వున్నా భారతి విద్యా మందిర్ పాఠశాలకుచెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ఖో -ఖో పోటీలో మొదటి బహుమతి మరియు కబడ్డీ లో ద్వితీయ బహుమతి సాధించిన విద్యార్థులను పాఠశాల కారస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి అభినందించారు.అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఆటలలో కూడా రాణించాలని తరగతి గదుల
లో పిల్లలు సత్పవార్తన కలిగి ఉపాధ్యాయులు బోధించు పాఠాలను శ్రద్ద గా వింటూ క్రమశిక్షణ తో మెలగాలని అయన అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నిరంజని రెడ్డి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు ప్రవీణ్, శ్రీకాంత్, బిక్షం,శివ, నరసింహ,తదితరులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం