మన ప్రగతి న్యూస్ /తలమడుగు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచింది ప్రజాపాలన లొ భాగంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నేరా వేర్చిన సందర్బంగా తలమడుగు మండలంలోని ఉండం ఆయుష గార్డెన్ లొ సమావేశం జరిగింది. అయితే ముందుగా తలమడుగు మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జు ఆడే గజేందర్ కి శాలువాతో సన్మానం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టపాసులు కాలుస్తు సభకు స్వాగతం పలికారు.అనoతరం సభను ఉద్దేశించి ఆడే గజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి తగ్గిందని త్వరలో నిరుపేదలకు అందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం లొ డబుల్ బెడ్ రూమ్ లు కట్టి ఇస్తామని ఒక వ్యక్తి దగ్గర లక్ష లు లంచాలు తీసుకున్నారు అని అన్నారు.ఈ కార్యక్రమం లొ మాజీ ఎంపీపీ కళ్యాణం రాజేశ్వర్ శ్రీధర్ రెడ్డి ప్రకాష్ రావ్ అలాగే నాయకులు రావుల నారాయణ వెంకటేష్ అశోక్ వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.