Breaking News

రైతు భరోసా రాలేదు కానీ రైతు పండుగ ఎలా జరిపేది.

మన ప్రగతి న్యూస్ /ఇచ్చోడా.

రైతు భరోసా రాలేదు రైతు బందు రాలేదు మేము ఎలా రైతు పండుగ జరుపుకోవలి చెప్పండి ముక్యమంత్రి అని బుధవారం నాడు బోథ్ నియోజకవర్గం లోని ఇచ్చోడా మండలనికి చెందిన ముక్రా (కే )గ్రామస్తులు ప్లా కార్డు లు పట్టుకొని వ్యవసాయం పొలం రైతులు నిరసన వ్యక్తం చేశారు. రైతులకు రైతు బందు లేదు ప్రతి మహిళ కూ 2500 ఇస్తాము అన్నారు అది లేదు. ఏ విదంగా మేము ప్రజా పాలనా విజయాత్సవాలు జరుపుకోవాలని అన్నారు.ఈ నిరసన సందర్బంగా ముక్రా గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి మాట్లాడుతూ తెలంగాణ హయం లొ కెసిఆర్ ఇచ్చినా మాట తప్ప కుండా ప్రతి ఒక్క హామీ నెరవేర్చారన్నారు.సమయానికి రైతు బందు ఇచ్చారు. రైతు చనిపోతే వారం రోజుల లోపల రైతు బీమా వచ్చింది అని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఇచ్చిన హామీలు కాగితలకే పరిమితం చేశారు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వంద రోజుల్లో ఆరు గ్యారంటీ లు అమలు చేస్తాం అన్నారు.

మాయ మాటలు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తానని యువతిని మోసం చేసిన దుండగులు

కానీ వారు ఇచ్చినా ఆరు హామీలకు గ్యారంటీ లేదని అన్నారు.రేవంత్ రెడ్డి మాత్రం ఆరు గ్యారంటీ లు వంద శతమ్ అమలు చేశాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు అని కాంగ్రెస్ ప్రభుత్వం పై మండీ పడ్డారు.ఆర్ టీ సి బస్సులో మహిళ ల కూ ఫ్రీ అని చెప్పి బస్సుల ట్రిప్పులు తగ్గించారాని అని అన్నారు. ఈ కార్యక్రమం లొ ముక్రా గ్రామ సర్పంచ్ మీనాక్షి రైతులు బి. అర్. ఎస్. నాయకులు పాల్గొన్నారు.