మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ లో గీతా జయంతి ఉత్సవాలు సందర్భంగా ముస్తాబాద్ అయ్యప్ప ఆలయంలో రాజు గురు స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయంలో భగవద్గీత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.అనంతరం భగవద్గీత పుస్తకాలకు పూజలు చేసి శ్లోకాలు పఠించి గీతా పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాజు గురు స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలనీ ముఖ్యంగా యువత తమ లక్ష్య సాధనకు గీతా ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు.
అలాగే ప్రతి ఇంటి నుండి తమ పిల్లలను దేశ, ధర్మ రక్షణకు అంటే ఆర్ ఆర్ ఎస్ లో, ఆర్మీలో చెర్పించాని చెప్పారు. అయ్యప్ప కమిటి కార్యదర్శి కాల్వ బాలాజీ మాట్లాడుతూ మన హిందూ సమాజాని బలహీన పరచడానికి అహింసా పరమో ధర్మః అని సగం శ్లోకం మాత్రమే మనకి అలవాటు చేశారు, కానీ అహింసా పరమో ధర్మః ధర్మ హింసా తథైవ చ అనే పూర్తి శ్లోకం ఆచరించవలసిన సమయం ఆసన్నమైంది తెలిపారు.సంఘటిత సమాజమే నిర్మాణమే హిందు సమాజానికి రక్షణ అని గుర్తు చేశారు. భాజపా మండల అధ్యక్షులు మెరుగు అంజగౌడ్ మాట్లాడుతూ భగవద్గీత అనేది జీవిత మొదటి దశలోనే చదవాల్సి పుస్తకం అని శ్రీ కృష్ణ పరమాత్మ యుద్ధం ప్రారంభానికి ముందు అశక్తుడుగా ఉన్న అర్జునుడికి హితోపదేశం చేసి యుద్ధానికి సన్నదం చేశాడు. అలాగే ఈ గీతా చదివితే మనల్ని కూడా కార్యోన్ముఖులయ్యేలా చేస్తుందని, ప్రస్తుతం పోరుగు దేశాలలో అస్థిర ప్రభుత్వాలు అంతఃకలహలు ఉన్నాయని మన దేశం దృఢమైన నాయకత్వంతో అభివృద్ధి వైపు పయనిస్తుంది తెలిపారు.కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అసాంఘిక శక్తులు దేశంలో కలహలు సృష్టించకుండా మనమందరం సంఘటితంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో విశ్వహిందు పరిషత్ మండల అధ్యక్షులు గూడెం దేవేందర్ .తోట ధర్మేందర్ తలారి నర్సయ్య. కొండ యాదగిరి గౌడ్. రాము మేస్త్రీ అయ్యప్ప స్వాములు. తదితరులు పాల్గొన్నారు.