మన ప్రగతి న్యూస్/హుజురాబాద్:
బుధవారం రోజు హుజురాబాద్ పట్టణములో బీజేపీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు ఆధ్వర్యంలో ఎన్నికల పర్వ్ ఎన్నికల అధికారి దండు కొమరయ్య పర్యవేక్షణలో 24 వ బూత్ గరిగె శివకృష్ణను , 25వ బూత్ ఛత్తర్ సింగ్ ను , 52 బూత్ నీలం రవీందర్ లను ఆయా బూత్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకుని నియామక పత్రం అందచేయటం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో టౌన్ జనరల్ సెక్రటరీ తూర్పాటి రాజు, నరాల రాజశేఖర్, శక్తి కేంద్ర సహయోగిలు తూముల శ్రీనివాస్, అంకటి వాసు, గంట సంపత్, మాజీ సర్పంచ్ పంజాల సుధాకర్ పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.