మన ప్రగతి న్యూస్/ఎల్కతుర్తి
సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్న కేటుగాళ్లపై ఎస్సై రాజ్ కుమార్ ఉక్కు పాదం మోపుతున్నారు. ఇటీవలే గంజాయి విక్రయదారులను అరెస్టు చేసి సమాజంలో చెడును కూకటివేళ్లతో తీసివేయడంలో ఎస్సై కృషి పట్ల ప్రజలు హర్షం చేస్తున్నారు. మంగళవారం రోజున నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై తన బృందంతో కలిసి దామెర గ్రామంలో పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. సమ్మక్క గద్దల వద్ద రైడ్ చేయగా తొమ్మిది మందిలో ఇద్దరు పరారయ్యారని సిఐ పులి రమేష్ పేర్కొన్నారు. చిట్టిపల్లి సాయికిరణ్, అంబాల రాజు, అంబాల నిఖిల్, కడారి హరీష్, కల్లూరీ శ్రీనివాస్, మాటూరి కిషన్, కడారా అనిల్ ను అరెస్టు చేశామని, ఇల్లందుల పునీందర్, ఓర్సు శ్రీనాథ్ పరారీ లో ఉన్నారని వారి వద్ద నుండి 18300 నగదు ఒక ఆటో ఆరు ఫోన్లు మూడు ద్విచక్ర వాహనాలు, సీజ్ చేసామని తెలిపారు. సీఐ పులి రమేష్ వివరాలు వెల్లడిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ రైడ్ లో పాల్గొన్న ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ విఠల్రావు మరియు బుచ్చిలింగం, కానిస్టేబుల్ తిరుపతి రంజిత్ సుమన్ లను అభినందించారు.