Breaking News

మద్యానికి బానిసై ఉరివేసుకొని వ్యక్తి మృతి

మన ప్రగతి న్యూస్/కేసముద్రం :

మద్యానికి బానిసై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం కేసముద్రం మండలంలో చోటుచేసుకుంది.. కేసముద్రం స్టేషన్ ఎస్ఐ మురళీధర్ రాజ్ వివరాలు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి.. లచ్చిరాం తండా కు చెందిన రాములు కుమారుడు బానోత్ రవి (45) గత కొద్ది కాలంగా ఇంట్లో ఏమి పని చేయకుండా ఇంటి వద్ద ఖాళీగా ఉంటూ మధ్యాహ్నం ప్రతిరోజు ఇంటికి త్రాగి వచ్చి ఇంట్లో గొడవ పడుతూ ఉండేవాడు..ఇదే క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మంగళవారం సాయంత్రం 4 30 గంటలకు పనిమీద బయటికి వెళ్లి సాయంత్రం 6 గంటలకు తిరిగి ఇంటికి రాగా రవి ఇంట్లో ఉన్న దూలానికి చీర సహాయంతో ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడని రవి మద్యం మత్తులో క్షణికావేశంలో ఉరివేసుకొని చనిపోయినాడు అని అతని తల్లి అయినా దర్జాన్ దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేయడమైనది..

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి