Breaking News

పేకాట స్థావరం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ మరియు గౌరారం పోలీసుల దాడి

మనప్రగతి న్యూస్/ గజ్వేల్ రూరల్:

గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాచారం గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు,గౌరారం పోలీసులు వెళ్లి రైడ్ చేయగా 05 గురుని అదుపులోకి తీసుకున్నారు 1 వ్యక్తి పారిపోయినాడు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 20,450/- వేల రూపాయలు, 04 మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు.
గౌరారం పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. పేకాట ఆడిన వారి వివరాలు కొత్తపల్లి వెంకటేష్ తండ్రి నర్సయ్య, గ్రామం నాచారం కొట్టాల లక్ష్మణ్ తండ్రి రాజయ్య, గ్రామం నాచారం రాజపేట నాగులు గౌడ్, గ్రామం మజీద్ పల్లి కలకుంట్ల దుర్గయ్య తండ్రి వెంకట రాజయ్య బుల్లగూడెం దండుపల్లి.మహమ్మద్ షఫీ తండ్రి జానీ మియా గ్రామం నాచారం పారిపోయిన వ్యక్తి వివరాలు చాప సత్యనారాయణ తండ్రి నర్సయ్య గ్రామం నాచారం.ఈ సందర్భంగాటాస్క్ ఫోర్స్ అధికారులు, గౌరారం పోలీసులు మాట్లాడుతూ* గ్రామాలలో పట్టణాలలో ఫామ్ హౌస్ లలో ఇళ్ళల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి