మన ప్రగతి న్యూస్ /ములకలపల్లి
ఆదివాసి గిరిజనులు ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని భూసమస్యలు పరిస్కారం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం సీనియర్ నాయకులు కరపాటి గోపాల్ రావు ములకలపల్లి తహశీల్దార్ కి వినతి పత్రం అదజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని నివసిస్తున్న ఆదివాసి గిరిజనుల భూ సమస్యలు పరిష్కారం చేయాలని ఆ సమస్యలు వారసత్య పట్టాలుఇప్పించాలని, అసైన్మెంట్ పట్టాలు మార్పిడి చేయాలని, క్రయ విక్రయాలు పట్టాలు ఇప్పించాలని, ఆదివాసి గిరిజనుల సాగులో ఉండబడిన ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్యాలని తదితర భూ సమస్యలు పరిష్కారం చెయ్యాలనీ కోరుతున్నారు. ఆదివాసి గిరిజనులు గతా అనేక సంవత్సరాలుగా భూ సమస్యులు పరిస్కారం కాకపోవడం వలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోవడంతో నష్టపోతున్నారు. ప్రభుత్వం పథకాలు రైతు భరోసా, రైతు రుణ మాఫీ ఇలాంటి పథకాలు రాకా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదివాసీ గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం సీనియర్ నాయకులు కరపాటి గోపాల్ రావు, మాజీ జెడ్పీటీసీ సంఘం నాయకులు సున్నం బాబురావు, వూకె శ్రీను, గడ్డం బాబురావు తదితరులు పాల్గొన్నారు.