Breaking News

సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభించిన ఏఎంసి వైస్ చైర్మన్

మన ప్రగతి న్యూస్/ పిట్లం:

పిట్లంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల మైదానంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ఏఎంసీ వైస్ చైర్మన్ కృష్ణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కల్పిస్తాయని, పోటీలలో గెలుపు ఓటమిలో సహజమని పేర్కొన్నారు. అనంతరం తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో కమలాకర్, ఎంఈఓ దేవి సింగ్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించడం జరిగింది. విద్యార్థులు ఉత్సాహంగా క్రీడా పోటీలను తిలకించారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు మండల శాఖ అధ్యక్షులు బన్సీలాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం