మన ప్రగతి న్యూస్/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి.
అర్హులైన ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు పథకం వర్తింప చేసేలా చొరవ తీసుకుంటామని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ తెలిపారు. సిద్ధిపేటలోని 9వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ళ కోసం సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలకు గూడు కల్పించాలన్న ఆలోచనతో ఇందిరమ్మ ఇల్లు పథకం తీసుకొచ్చారు అని అన్నారు. ప్రజలకు ఇంత మంచి పథకాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సర్వే అంతట జరుగుతుందని అర్హులైన వారు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని అన్నారు. బిఆర్ఎస్ నాయకులు పుకార్లు నమ్మవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు అందరినీ గుర్తిస్తామని అన్నారు. తమకు ఇందిరమ్మ ఇల్లు రాదేమో అని అపోహ కూడా పెట్టుకోవద్దని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఎవరైనా మీ దగ్గరికి వచ్చి డబ్బులు అడిగితే ఇవ్వవద్దని అన్నారు. ఎవరైనా వచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని డబ్బులు డిమాండ్ చేస్తే సిద్ధిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ పట్టణ అధ్యక్షుడు అత్తూఇమామ్ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గాజుద్దీన్ 29 వార్డ్ ఇంచార్జ్ రాషాద్. నాజ్జు బబులు. ఫాయాజ్. తదితరాలు పాల్గొన్నారు