మన ప్రగతి న్యూస్ / జమ్మికుంట టౌన్
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు (టీటీడీబోర్డు మెంబర్ )నన్నూరి నర్సిరెడ్డి హుజురాబాద్ యూత్ కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ హైదరాబాద్ లో కలిశారు. బుధవారం హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం టేకుల శ్రావణ్ మాట్లాడుతూ… పార్టీలకు అతీతంగా అందరితో కలిసి మెలిసి ఉండే మంచి మనసున్న వ్యక్తి నర్సిరెడ్డి అన్నను చాలా రోజుల తర్వాత కలవడం ఆనందంగా ఉందని తిరుమల శ్రీవారి ఆశీస్సులతో వారు చేపట్టిన పదవికి పూర్తి న్యాయం చేయాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇప్పలపల్లి చంద్రశేఖర్, అల్లెపు విజయ్, ఆకునూరి అజిత్,కమటం సందీప్ తదితరులు ఉన్నారు