మనప్రగతి న్యూస్/గజ్వేల్ రూరల్:
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డులో బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు నాయిని సందీప్ కుమార్ ఆధ్వర్యంలో భగవద్గీత జయంతి సందర్భంగా ఉచితంగా భగవద్గీతలను కొందరు వార్డ్ ప్రజలకు అందజేయడం జరిగింది. ప్రపంచానికి జ్ఞాన మార్గాన్ని అందించిన దివ్యోపదేశం
అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగులను నింపిన మహత్తర సందేశం
కర్మ సిద్ధాంతాన్ని ప్రబోధించి మనలను కార్యోన్ముఖులను చేసే విశ్వ విరాట్ స్వరూపం
గీత అంటే కేవలం భక్తి, వేదాంతమే కాదు
మనిషిని నడిపించే ప్రాణశక్తి మనిషిని మనీషిగా మార్చే జ్ఞాన దీప్తి గీత ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం
జడత్వాన్ని తొలగించి మనలో చైతన్యాన్ని నింపే కేంద్రం ఈ కార్యక్రమంలో బిజెపి సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు,బిజెపి గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్,బిజెపి గజ్వేల్ పట్టణ ఉపాధ్యక్షులు చెప్యాల వెంకట్ రెడ్డి,మడుగురి నరసింహ ముదిరాజ్,సోషల్ మీడియా గజ్వేల్ పట్టణ కో కన్వీనర్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు.