Breaking News

కనపర్తి గ్రామంలో కళాకారుల వేదిక గ్రామశాఖ కమిటీ నియామకం..

మన ప్రగతి న్యూస్ / జమ్మికుంట టౌన్

వీణవంక మండలం కనపర్తి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కళాకారుల వేదిక ఆధ్వర్యంలో గ్రామశాఖను బుధవారం రోజున ఎన్నుకున్నారు.గ్రామ శాఖ అధ్యక్షుడిగా చుక్కల రవీందర్,ఉపాధ్యక్షుడిగా బొల్లు సదానందం,కర్నె తిరుపతి,ప్రధాన కార్యదర్శిగా పర్లపల్లి తిరుపతి,కోశాధికారిగా ముంజ రవీందర్ ను ఎన్నుకున్నట్లు జమ్మికుంట మండల కళాకారుల వేదిక అధ్యక్షుడు వేముల అశోక్,ఉపాధ్యక్షుడు రంగు లింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారికి కళాకారులు సమాజంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని కోరారు.గ్రామ శాఖ కమిటీకి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు బోల్ల కొమురయ్య,ప్రధాన కార్యదర్శి బొడ్డు రాములు,కోశాధికారి తాళ్లపల్లి సంపత్,సీనియర్ కళాకారులు హుస్సేన్ నాయి,పడాల సత్యనారాయణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం