మోహన్ బాబుపై వెంటనే కేసు నమోదు చేయాలి.
మన ప్రగతి న్యూస్/సిద్దిపేట జిల్లా ప్రతినిధి.
ప్రభుత్వానికి అన్ని వర్గాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాచారాన్ని సేకరించి అందజేస్తున్న జర్నలిస్టులపై దాడులు సమంజసం కాదని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య జరుగుతున్న గొడవల గురించి కవరేజ్ కోసం వెళ్లిన టీవీ9 ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. మోహన్ బాబుకు మానసిక స్థితి సరిగా లేనట్లు ఉందని అతన్ని వెంటనే ఎర్రగడ్డలోని మానసిక రోగుల కేంద్రానికి పంపించాలని అన్నారు. ఇష్టం వచ్చినట్లుగా బౌన్సర్లను పెట్టి ఒక భయంకర వాతావరణ సృష్టిస్తున్నారని అన్నారు. అలాంటి వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహించ బోరని అన్నారు. జర్నలిస్టులపై అకారణంగా దాడులకు పాల్పడి విచక్షణ రహితంగా కొట్టిన మోహన్ బాబు పై పోలీసులు సుమోటో కింద వెంటనే నాన్ బేయిలేబుల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మరోసారి జర్నలిస్టులపై దాడి జరగకుండా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుకు అండగా నిలబడుతుందని అన్నారు. మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి చేయడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ కార్యదర్శి గ్యదారీ మధు పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గాజుద్దీన్ ఫయాజ్ నజ్జు తదితరులు పాల్గొన్నారు