మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో
ఉద్యాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడి సాదించవచ్చని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. బుదవారం ఉద్యానవన అధికారి, మండల ఉద్యాన అధికారులతో కలిసి కురవి, డోర్నకల్, మహబూబాబాద్ మండలాలలోనీ గ్రామాలలో సాగు లో వున్న ఉద్యాన పంటలు, కూరగాయలు, మామిడి, జామ, బొప్పాయి,ఆయిల్ పామ్ పంటలను సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్బంగా రైతులకు పలు సాంకేతిక సూచనలు తెలిపారు. సాధారణ పద్దతిలో టమాటా సాగు చేయడం కన్నా ట్రెల్లిస్ (ఎగబాకించే) పద్దతిలో సాగు చేయడం వలన మేలైన,నాణ్యమైన దిగుబడుల తో పాటు ఎకరానికి లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చన్నారు. మామిడి పూత, పిందె సమయం లో తీసుకోవాలసిన సస్య రక్షణ చర్యలు చేపట్టాలని, పంట మార్పిడి చేసి ఆయిల్ పామ్, బొప్పాయి పలు మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి ఆర్.శాంతి ప్రియ, ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ అధికారి చంద్ర ప్రకాష్, బిందు సేద్య ప్రతినిధి అగస్టిన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.