Breaking News

నేడే ఐక్య క్రిస్మస్ సంబరాలువిజయవంతం చేయాలని క్రైస్తవులకు పిలుపునిచ్చిన ఏఐసీసీ రాష్ట్ర అధ్యక్షులు రెవ పి ఏనోష్ కుమార్

మన ప్రగతి న్యూస్/ ఖమ్మం జిల్లా స్టాపర్

లోకరక్షకుడైన యేసుక్రీస్తు పుట్టినరోజును పురస్కరించుకొని ముందస్తుగా క్రైస్తవులందరూ ఐక్యంగా జరుపుకొనే ఐక్య క్రిస్మస్ సంబరాలు మండల కేంద్రంలోని లక్కినేని వారి ఆవరణంలో నిర్వహించడం జరుగుతుందని ఏఐసీసీ రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ పి ఏనుష్ కుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం 6 గంటల నుండి నిర్వహించే కార్యక్రమంలో క్రిస్మస్ గీతాలాపన, క్యాండిల్ లైట్ సర్వీస్, చిన్నారుల ఆధ్యాత్మిక సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించబడుతుందని తెలిపారు.ముఖ్య వాక్యోపదేశకులుగా రాజా ఫేయిత్ మినిస్ట్రీస్ హైదరాబాద్ డైరెక్టర్ పాస్టర్ రాజా హేబెల్ ప్రసంగిస్తారని కావున సకాలంలో క్రైస్తవులు, క్రైస్తవేతరులు, భక్తులు పాల్గొని దైవాశీస్సులు పొందాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా అమ్మ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి నందిని విక్రమార్క, ముఖ్య అతిథులుగా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ, చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి శాసన సభ్యురాలు డాక్టర్ మట్ట రాగమయి దయానంద్, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి మరియు ఏఐసీసీ అసోసియేషన్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్నాశి బాలరాజు, మీడియా సెల్ జిల్లా అధ్యక్షుడు దాసరి డేవిడ్ రాజు, మండల అధ్యక్షులు తేళ్ళ ఎబినేజర్, ఉపాధ్యక్షులు దయాకర్, సెక్రెటరీ జాన్ పరంజ్యోతి, కోశాధికారి మహేష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ జీవన్ కుమార్ ,రాజశేఖర్, సుందర్ రాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొంటారని తెలిపారు.

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం