మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డిపేట

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ప్రభుత్వ ఉపాధ్యాయనిగా పనిచేస్తున్న లింగాల రాజు అనే ఉపాధ్యాయుడు క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో సుమారు మంది విద్యార్థులకు క్రిస్మస్ బైబిల్ విద్యార్థులకు పంపిణీ చేశాడు ఈ విషయాన్ని పాఠశాల విద్యార్థులు ఏబీవీపీ నాయకులకు ఫిర్యాదు చేయగా నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకొని లింగాల రాజు అనే ఉపాధ్యాయుడు పంచిన బైబిల్ లను విద్యార్థుల నుండి స్వాధీనం చేసుకున్నారు.పాఠశాల ఉపాధ్యాయ గదిలో ఉన్న మరో బైబిల్ ప్యాకింగ్ ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఈ ఉపాధ్యాయుడు అనేక మత మార్పిడి చేశారు ఇతని పైన కేసు నమోదు చేయాలనీ డిమాండ్ చేశారు.దీంతో ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారు లకు ఫిర్యాదు చేశారు.